తిరుమల శ్రీవారికి రూ. 2 కోట్ల విలువైన స్వర్ణ శంఖు, చక్రాలు.. విరాళంగా ఇచ్చిన తమిళనాడు భక్తుడు

24-02-2021 Wed 09:07
  • మూడున్నర కిలోల బంగారంతో శంఖు, చక్రాలు
  • ఈ ఉదయం అందజేత
  • గతంలోనూ పలు బంగారు, వజ్రాభరణాల విరాళం
Tamil Nadu Devotee donate Shanku Chakra to Tirumala Srivaru

తిరుమల శ్రీవారికి తమిళనాడుకు చెందిన భక్తుడు రెండు కోట్ల రూపాయల విలువైన శంఖు, చక్రాలను విరాళంగా ఇచ్చి భక్తి చాటుకున్నాడు. తేనెకు చెందిన స్వామివారి భక్తుడు తంగదొరై  మూడున్నర కిలోల బంగారంతో శ్రీవారికి శంఖు, చక్రాలు చేయించారు. ఇందుకోసం రెండు కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టు చెప్పారు. ఈ ఉదయం టీటీడీ అదనపు ఈవోకు వీటిని అందజేశారు. కాగా, తంగదొరై గతంలోనూ శ్రీవారికి బంగారు, వజ్రాభరణాలను విరాళంగా ఇచ్చారు. అందులో బంగారు కటి, వరద హస్తాలు, వడ్డాణం, వజ్రాభరణాలు ఉన్నాయి.