విజయ్ దేవరకొండ 'లైగర్' సెట్స్ పై రమ్యకృష్ణ

23-02-2021 Tue 20:00
  • విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్'
  • పూరీ జగన్నాథ్ దర్శకత్వం
  • ముంబయిలో షూటింగ్
  • విజయ్ దేవరకొండకు తల్లిగా నటిస్తున్న వైనం
Ramyakrishna attends Liger shooting in Mumbai

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ముంబయిలో 'లైగర్' షూటింగ్ లో పాల్గొంటున్నాడు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ముంబయిలో లైగర్ సెట్స్ పై సీనియర్ నటి రమ్యకృష్ణ దర్శనమిచ్చింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు రమ్యకృష్ణ తల్లిగా నటిస్తోంది. తనయుడ్ని నేషనల్ బాక్సింగ్ చాంపియన్ ను చేయాలని తపించిపోయే తెలంగాణ గ్రామీణ ప్రాంత తల్లిగా రమ్యకృష్ణ ఈ సినిమాలో కనిపించనుంది. సెట్స్ పై విజయ్ దేవరకొండతో రమ్యకృష్ణ ఫొటోలు వైరల్ గా మారాయి.

మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ కఠోరంగా కసరత్తులు చేసి, ఓ ఫైటర్ లా తయారయ్యాడు. చార్మీ కౌర్, కరణ్ జోహార్ భాగస్వామ్యంలో నిర్మితమవుతున్న 'లైగర్' సెప్టెంబరు 9న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.