Andhra Pradesh: ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్లకు ముగిసిన గడువు

  • ఏపీలో రెండు స్థానాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు
  • రేపు నామినేషన్ల పరిశీలన
  • ఉపసంహరణకు ఫిబ్రవరి 26 వరకు అవకాశం
  • మార్చి 14న పోలింగ్
  • మార్చి 17న ఓట్ల లెక్కింపు
AP Teacher MLC Elections

ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం నెలకొంది. గుంటూరు-కృష్ణా... తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలకు  ఈ సాయంత్రంతో నామినేషన్ల పర్వం ముగిసింది. రేపు అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు ఫిబ్రవరి 26. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 17న ఓట్ల లెక్కింపు చేపడతారు.

గుంటూరు-కృష్ణా స్థానం కోసం 16 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ ఎన్నికల కోసం గుంటూరు జిల్లాలో 59, కృష్ణా జిల్లాలో 51 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 13,121 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

More Telugu News