Deep Sidhu: నటుడు, యాక్టివిస్ట్ దీప్ సిద్దూకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ

14 days judicial custody for Deep Sidhu
  • రిపబ్లిక్ డే నాడు హింసాత్మకంగా మారిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ
  • ఎర్రకోటకు దూసుకుపోయి మతపరమైన జెండా ఎగురవేసిన వైనం
  • హింసాత్మక ఘటనల్లో 500 మంది పోలీసులకు గాయాలు
రిపబ్లిక్ డే నాడు ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఎర్రకోటకు దూసుకుపోయిన నిరసనకారులు... అక్కడ మతపరమైన జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా జరిగిన ఘటనల్లో 500 మంది పోలీసులు గాయపడ్డారు. ఒక నిరసనకారుడు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి నటుడు, యాక్టివిస్ట్ దీప్ సిద్దూపై కేసు నమోదైంది. ఆయన చేసిన ప్రసంగంతో ఆందోళనకారులు రెచ్చిపోయారని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

సిద్దూ ఏడు రోజుల కస్టడీ ముగియడంతో ఈరోజు ఢిల్లీలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సమర్జీత్ కౌర్ ముందు ఆయనను పోలీసులు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ ఆయనకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించారు.
Deep Sidhu
Judicial Custody
Delhi Court
Republic Day Violence

More Telugu News