కరాటే కల్యాణి సాయంతో రాజమండ్రి పాస్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి

23-02-2021 Tue 18:16
  • పాస్టర్ షారోన్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రియాంక
  • పెళ్లి పేరుతో మోసం చేశాడని ఫిర్యాదు
  • వీడియోలతో బెదిరిస్తున్నాడని ఆరోపణ
  • పాస్టర్ బెదిరింపులతో ప్రియాంక హైదరాబాదులో తలదాచుకుందన్న కల్యాణి
  • షీ-టీమ్ సూచనతో రాజమండ్రిలో ఫిర్యాదు చేశామని వెల్లడి
Woman complains against a pastor with the help of Karate Kalyani

రాజమండ్రిలో ప్రియాంక అనే యువతి స్థానిక పాస్టర్ షారోన్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పాస్టర్ షారోన్ పెళ్లి పేరుతో వంచనకు గురిచేశాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి వీడియోలతో బెదిరిస్తున్నాడని ఆరోపించింది. ఈ క్రమంలో ప్రియాంక టాలీవుడ్ సినీ నటి కరాటే కల్యాణి సాయంతో పోలీసులను ఆశ్రయించింది.

దీనిపై కరాటే కల్యాణి స్పందిస్తూ, షారోన్ బెదిరింపులతో ప్రియాంక హైదరాబాదులో తలదాచుకుందని వెల్లడించారు. ప్రియాంకకు జరిగిన అన్యాయం గురించి తెలుసుకుని తాము అండగా నిలిచామని వివరించారు. హైదరాబాదు షీ-టీమ్ పోలీసుల సూచన మేరకు రాజమండ్రిలో ఫిర్యాదు చేశామని తెలిపారు. పాస్టర్ షారోన్ ను కఠినంగా శిక్షించి యువతికి న్యాయం చేయాలని కరాటే కల్యాణి డిమాండ్ చేశారు. మతాలకు అతీతంగా తాము సాటి మహిళ కోసం పోరాడుతున్నామని స్పష్టం చేశారు.