"అంగి సుట్టు మడతేసి.." అంటూ నాని హీరోయిజం... 'టక్ జగదీష్' నుంచి టీజర్ విడుదల

23-02-2021 Tue 17:35
  • నాని హీరోగా టక్ జగదీష్ చిత్రం
  • శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా
  • రేపు నాని పుట్టినరోజు
  • ఒకరోజు ముందుగా టీజర్ రిలీజ్
  • ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన
Nani Tuck Jagadish teaser released

నాని, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ ప్రధానపాత్రల్లో వస్తున్న చిత్రం 'టక్ జగదీష్'. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజైంది. రేపు (ఫిబ్రవరి 24) నాని పుట్టినరోజు కాగా, ఒకరోజు ముందు టీజర్ రూపంలో అభిమానులకు కానుక అందింది. "అంగి సుట్టు మడతేసి..." అంటూ గ్రామీణ యాసలో సాగే గీతం నేపథ్యంలో వినవస్తుండగా, హీరో నాని కొన్ని వీరోచిత దృశ్యాలతో కనువిందు చేయడం ఈ టీజర్ లో చూడొచ్చు. గతంలో 'నిన్ను కోరి' చిత్రంతో హిట్ కొట్టిన నాని-శివ నిర్వాణ జోడీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. 'టక్ జగదీష్' టైటిల్ తోనే ఆడియన్స్ లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

టీజర్ చూస్తుంటే పక్కా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో వచ్చే కుటుంబ కథా చిత్రమని, అటు కమర్షియల్ విలువలకు లోటు ఉండదని అర్థమవుతోంది. ఈ టీజర్ కు అభిమానుల నుంచి భారీగా స్పందన లభిస్తోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీశ్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. జగపతిబాబు, నాజర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.