AP Cabinet: కాకినాడ సెజ్ అంశంలో ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం... పరిహారం తీసుకోని రైతులకు భూమి వాపసు

  • సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ
  • కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రిమండలి
  • కాకినాడ రైతులకు 2,180 ఎకరాలు వాపసు
  • 6 గ్రామాలు ఖాళీ చేసే అవసరంలేదన్న పేర్ని నాని
AP Cabinet key decisions on Kakinada SEZ

నేడు జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో కాకినాడ సెజ్ పరిహారం అంశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కాకినాడ సెజ్ కు భూములు ఇచ్చి పరిహారం తీసుకోని వారికి భూమి వాపసు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు కాకినాడ రైతులకు 2,180 ఎకరాలు తిరిగిచ్చేందుకు కేబినెట్ ఆమోదించింది.

దీనిపై ఏపీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, కేబినెట్ నిర్ణయంతో 6 గ్రామాలు ఖాళీ చేసే అవసరం లేకుండా పోయిందని వెల్లడించారు. ఆ భూమిని 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

అంతేకాకుండా, కాకినాడ సెజ్ వ్యర్థాలు సమస్య కాకుండా చూడాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. దివీస్ ల్యాబ్స్ వ్యర్థాలు సముద్రంలో కలవకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇక, కేబినెట్ సమావేశంలో తీసుకున్న ఇతర నిర్ణయాల గురించి వివరిస్తూ, టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. రూ.10,802 కోట్లతో వైఎస్సార్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదించిందని చెప్పారు.

More Telugu News