మోహ‌న్ లాల్ కూతురి టాలెంట్‌పై బిగ్ బీ ప్ర‌శంస‌లు

23-02-2021 Tue 16:20
  • క‌వితల‌తో పుస్త‌కం రాసిన మోహ‌న్ లాల్ కూతురు
  • అమితాబ్ కు పంపిన మోహ‌న్ లాల్
  • ప్ర‌శంసిస్తూ బిగ్ బీ ట్వీట్
  • అమితాబ్‌కు మోహ‌న్ లాల్‌ కృత‌జ్ఞ‌త‌లు
big b praises mohan lal daughter

త‌న‌కు మలయాళ హీరో మోహన్‌ లాల్‌ ఓ బహుమతి పంపార‌ని చెబుతూ బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ ట్వీట్ చేశారు. మోహన్‌ లాల్‌ కూతురు విస్మయ ‘గ్రెయిన్స్‌ ఆఫ్‌ స్టార్‌డస్ట్‌’ పేరిట ఓ పుస్తకం రాయ‌గా, ఇటీవ‌ల దాన్ని విడుద‌ల చేశారు. బిగ్‌బీకి ఈ పుస్తకాన్ని మోహన్‌ లాల్ పంపారు. ఈ విష‌యాన్నే బిగ్ బీ ప్ర‌స్తావించారు.

తాను ఎంతో అభిమానించే వ్యక్తి మోహన్‌ లాల్ అని, ఆయన కూతురు విస్మయ రాసిన పుస్త‌కాన్ని త‌న‌కు పంపించారని బిగ్ బీ పేర్కొన్నారు. ఈ పుస్తకంలో సృజనాత్మకతతో కూడిన కవితలతో పాటు పెయింటింగ్‌లు ఉన్నాయ‌ని చెప్పారు. ఈ పుస్తకం త‌న‌కు బాగా నచ్చిందని చెప్పారు. ఇంతటి ప్రతిభ వారసత్వంతోనే వస్తుందని, విస్మయకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

బిగ్ బీ ప్ర‌శంసించ‌డంతో మోహ‌న్ లాల్ హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ.. ఓ తండ్రిగా ఇది గర్వించే సమయమ‌ని చెప్పారు. బిగ్ బీ వంటి స్టార్‌ నుంచి త‌న కూతురు ప్రశంసలు అందుకుందంటే సాధారణ విషయం కాదని ఆయ‌న అన్నారు. అమితాబ్‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాన‌ని పేర్కొన్నారు.