'పచ్చీస్' చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ లను ఆవిష్కరించిన నాగార్జున

23-02-2021 Tue 12:37
  • కొత్తవాళ్లతో 'పచ్చీస్' చిత్రం
  • హైదరాబాదులో టైటిల్ ఆవిష్కరణ
  • చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపిన నాగ్
  • శ్రీకృష్ణ-రమా సాయి దర్శకత్వంలో చిత్రం
Nagarjuna unveils Pachchis movie title and first look

నూతన తారాగణంతో తెరకెక్కుతున్న చిత్రం 'పచ్చీస్'. ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లను అగ్రహీరో నాగార్జున ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం హైదరాబాదులో జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అవసా చిత్రం, రాస్తా ఫిలింస్ బ్యానర్లపై కౌశిక్ కుమార్ కత్తూరి, రమా సాయి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకృష్ణ-రమా సాయి ద్వయం దర్శకత్వం వహిస్తోంది. రచన శ్రీకృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బొల్లెబోయిన దినేశ్ యాదవ్. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.