విశాఖ స్వామీజీకి సీఎం జగన్ సాష్టాంగపడడం విడ్డూరంగా ఉంది: వర్ల రామయ్య

23-02-2021 Tue 12:25
  • విశాఖ శారదాపీఠంలో వార్షికోత్సవాలు
  • సీఎం జగన్ ప్రత్యేక పూజలు
  • విమర్శలు చేసిన వర్ల
  • అదే స్వామీజీకి సవాంగ్ సాగిలపడ్డారంటూ వ్యాఖ్యలు
Varla Ramaiah comments on CM Jagan

విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్ అక్కడ ప్రత్యేక పూజలు చేయడం తెలిసిందే. దీనిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. అత్యంత వివాదాస్పదుడు, విశాఖ స్వామీజీని సీఎం జగన్ సందర్శించి సాష్టాంగపడడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. అదే స్వామీజీకి పోలీసు అధిపతి సవాంగ్ సాగిలపడడం, వెంటనే ఆర్టీసీ ఎండీ ఠాకూర్, పలు ఆరోపణలు ఎదుర్కొనే దుర్గ గుడి ఈఓ సురేశ్ కలవడం అనుమానంగా ఉంది కదూ అంటూ వర్ల ట్వీట్ చేశారు.