Imran Khan: భారత గగనతలాన్ని వాడుకునేందుకు ఇమ్రాన్ ఖాన్ కు అనుమతి!

India Permits Imran Khan Flight to use Air Space
  • 23న శ్రీలంక వెళ్లనున్న ఇమ్రాన్ ఖాన్
  • గతంలో మోదీ ప్రయాణానికి అంగీకరించని పాక్
  • ఇమ్రాన్ విమానానికి ఓకే చెప్పిన భారత్
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రయాణించే విమానం భారత గగనతలం మీదుగా శ్రీలంక వెళ్లేందుకు అనుమతి ఇచ్చినట్టు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. 23న ఆయన శ్రీలంక పర్యటకు వెళుతుండగా, ఆ విమానం భారత్ మీదుగా వెళ్లనుంది.

కాగా, 2019లో ప్రధాని నరేంద్ర మోదీ యూఎస్, సౌదీ అరేబియా దేశాల పర్యటనకు బయలుదేరిన వేళ, తమ గగనతలాన్ని వాడుకునేందుకు పాకిస్థాన్ అనుమతించని  సంగతి గుర్తుండే ఉంటుంది. కశ్మీర్ లో మానవ హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని ఆ సమయంలో పాక్ ఆరోపించింది. నాటి ఘటనను మనసులో పెట్టుకోని భారత విమానయాన శాఖ, ఇమ్రాన్ ఖాన్ విమానానికి అనుమతినిచ్చింది.
Imran Khan
India
Air Space
Srilanka

More Telugu News