ప్రధానిపై అభ్యంతరకర పోస్టులు.. ఇద్దరిపై కేసు నమోదు

23-02-2021 Tue 09:37
  • చిత్తూరు జిల్లా రామసముద్రం మండలంలో ఘటన
  • పోలీసులకు బీజేపీ నేతల ఫిర్యాదు
  • దర్యాప్తు చేపట్టిన పోలీసులు
Case filed against two in Chittoor on social media posts against Modi

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై అనుచిత పోస్టులు పెట్టిన ఇద్దరిపై చిత్తూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాలోని రామసముద్రం మండలం దిగువపేటకు చెందిన ఆదిల్, దాదాపీర్‌ అనే ఇద్దరు వ్యక్తులు సోషల్ మీడియాలో ప్రధానిపై అభ్యంతరకర పోస్టులు పెట్టినట్టు రామసముద్రం పోలీసులు తెలిపారు. అంతేకాక, ఆ పోస్టులు హింసను ప్రేరేపించేలా ఉన్నాయన్నారు. ఆ పోస్టులపై బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు చెప్పిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు.