కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

23-02-2021 Tue 08:31
  • బీజేపీలో చేరబోను
  • మునుగోడు రుణం తీర్చుకుంటా
  • మీడియాతో రాజగోపాల్ రెడ్డి
Komatireddy Clarifies on Party Change

తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. చౌటుప్పల్ లో తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, తాను కాంగ్రెస్ కు రాజీనామా చేసి, బీజేపీ అభ్యర్థిగా సాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నానంటూ ఓ పత్రికలో వచ్చిన న్యూస్ చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. గతంలో తాను బీజేపీకి అనుకూలంగా మాట్లాడిన మాట వాస్తవమేనని వ్యాఖ్యానించిన ఆయన, ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ను వీడబోనని, మునుగోడు ప్రజల రుణం తీర్చుకోవడమే తన కర్తవ్యమని పేర్కొన్నారు.