సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

23-02-2021 Tue 07:35
  • రవితేజ సరసన మలయాళీ భామ  
  • ఎన్టీఆర్ సినిమాలో విజయ్ సేతుపతి
  • వెంకటేశ్ కి జంటగా మళ్లీ మీనా   
Anu Emmanuel opposite Raviteja

*  రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. రవితేజ నటిస్తున్న ఈ 68వ చిత్రంలో కథానాయికగా మలయాళీ బ్యూటీ అను ఇమ్మానుయేల్ కు ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుపుతున్నారట.
*  ఇటీవల రిలీజైన 'ఉప్పెన' సినిమాలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి త్వరలో ఎన్టీఆర్ సినిమాలో కూడా నటించే అవకాశం వుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందే సినిమాలో ప్రధాన విలన్ పాత్రకు విజయ్ సేతుపతిని తీసుకుంటున్నారట. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.
*  మలయాళంలో హిట్టయిన 'దృశ్యం' సీక్వెల్ 'దృశ్యం 2' చిత్రాన్ని తెలుగులో వెంకటేశ్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. 'దృశ్యం'లో లానే ఇందులో కూడా వెంకటేశ్ సరసన ప్రముఖ నటి మీనా జంటగా నటిస్తుందట. జీతూ జోసెఫ్ దీనికి కూడా దర్శకత్వం వహిస్తాడు.