నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మొవ్వ అరుణ్ కుమార్... ఎల్. రమణకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా చాన్స్

22-02-2021 Mon 22:10
  • కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ టీడీపీ
  • త్వరలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు 
  • గ్రాడ్యుయేట్స్ బరిలో ఎల్.రమణ
  • హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానం నుంచి పోటీ
TDP announced Movva Arun Kumar as their candidate in Nagarjunasagar by polls

తెలంగాణలో ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలు, ఆపై జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎంతో ఆసక్తికరంగా సాగాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడందరి దృష్టి నాగార్జునసాగర్ ఉప ఎన్నికలపై పడింది. తాజాగా, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల కోసం టీడీపీ తన అభ్యర్థిని ప్రకటించింది. ఇక్కడ తమ అభ్యర్థిగా మొవ్వ అరుణ్ కుమార్ ను ఎంపిక చేసింది.

ఈ మేరకు తెలంగాణ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ తెలిపారు. ఇక తెలంగాణ టీడీపీ చీఫ్ ఎల్.రమణకు ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఎల్.రమణ... రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారు.