Mahesh Babu: 'ఉప్పెన' గురించి ఒక్కమాటలో చెప్పాలంటే... క్లాసిక్: మహేశ్ బాబు 

Mahesh Babu terms Uppena movie a timeless classic
  • ఇటీవల విడుదలైన ఉప్పెన
  • వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా చిత్రం
  • కలకాలం నిలిచే చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోతుంది 
  • దర్శకుడు బుచ్చిబాబుకు అభినందనలు
  • వైష్ణవ్ తేజ్, కృతి ఇక స్టార్లు అంటూ వ్యాఖ్యలు
ఇటీవల రిలీజై సక్సెస్ ఫుల్ గా ముందుకెళుతున్న ఉప్పెన చిత్రం చూసిన తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన భావోద్వేగాలను దాచుకోలేకపోయారు. ఈ చిత్రంపై ట్విట్టర్ లో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఉప్పెన గురించి ఒక్కమాటలో చెప్పాలంటే "క్లాసిక్" అని కొనియాడారు.

"బుచ్చిబాబు సానా... మీరు తీసిన చిత్రం అత్యంత అరుదైన.. కలకాలం నిలిచే చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. ఇక ఉప్పెన చిత్రానికి గుండెకాయ అంటే దేవిశ్రీప్రసాద్ అనే చెప్పాలి. ఆల్ టైమ్ గ్రేట్ సంగీతాల్లో ఒకటిగా ఉప్పెన పాటలు, నేపథ్య సంగీతం నిలిచిపోతాయి. డీఎస్పీ... మీరు ఇప్పటివరకు చేసిన అన్ని చిత్రాల్లో ఇదే అత్యుత్తమం. మీరు ఇదే ఒరవడి కొనసాగించాలి" అని ఆకాంక్షించారు.

హీరోహీరోయిన్లు వైష్ణవ్ తేజ్, కృతిశెట్టిలను మహేశ్ ఆకాశానికెత్తేశాడు. "ఇద్దరూ కొత్తవాళ్లు అయినా కళ్లు చెదిరేలా నటించారు. మీరిద్దరూ ఇక స్టార్లే!" అని పేర్కొన్నారు. "చివరగా సుకుమార్ కు, మైత్రీ మూవీ మేకర్స్ కు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఉప్పెన వంటి ప్రాజెక్టుకు మద్దతుగా నిలిచారు. నేను చెప్పినట్టుగా ఉప్పెన సినీ చరిత్రలో కలకాలం నిలిచే చిత్రంగా నిలిచిపోతుంది" అని మహేశ్ బాబు పేర్కొన్నారు. 
Mahesh Babu
Uppena
Classic
Buchibabu Sana
Vaishnav Tej
Krithi Shetty
Devi Sri Prasad
Sukumar
Tollywood

More Telugu News