ఇంగ్లండ్ తో మిగిలిన రెండు టెస్టులకు టీమిండియాలో ఉమేశ్ యాదవ్ కు చోటు

22-02-2021 Mon 21:40
  • భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగు టెస్టుల సిరీస్
  • ముగిసిన రెండు టెస్టులు
  • ఈ నెల 24 నుంచి మొతేరాలో మూడో టెస్టు
  • ఇటీవల ఆసీస్ సిరీస్ లో గాయపడిన ఉమేశ్
  • ఆదివారం నిర్వహించిన ఫిట్ నెస్ టెస్టులో పాస్
Umesh Yadav gets place in Team India for remaining two tests against England

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ సందర్భంగా గాయపడిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ ఫిట్ నెస్ నిరూపించుకున్నాడు. దాంతో ఉమేశ్ కు ఇంగ్లండ్ తో మిగిలిన రెండు టెస్టుల్లో ఆడే భారత జట్టులో స్థానం కల్పించారు. అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియంలో ఆదివారం జరిగిన ఫిట్ నెస్ టెస్టులో ఉమేశ్ పాసయ్యాడు.

ఇక, విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు గాను ముంబయి పేసర్ శార్దూల్ ఠాకూర్ ను టీమిండియా నుంచి విడుదల చేశారు. భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా మూడో టెస్టు ఈ నెల 24 నుంచి మొతేరాలో జరగనుంది. ఈ సిరీస్ లో తొలి టెస్టును ఇంగ్లండ్ గెలవగా, రెండో టెస్టులో భారత్ ఘనవిజయం సాధించి 1-1తో సమం చేసింది.

జట్టు వివరాలు...

విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, శుభ్ మన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్.