షర్మిల కార్యక్రమాల సమన్వయకర్తగా రాజగోపాల్ నియామకం

22-02-2021 Mon 17:56
  • తొలి నియామకం చేపట్టిన షర్మిల
  • రాజగోపాల్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందినవారు
  • 30 ఏళ్లుగా వైయస్ కుటుంబంతో పరిచయం
Rajagopal appointed Sharmila Program Coordinator

తెలంగాణలో కొత్త పార్టీని పెట్టబోతున్న వైయస్ షర్మిల వేగం పెంచుతున్నారు. దివంగత వైయస్సార్ అభిమానులతో ఆమె సమీక్షలు నిర్వహిస్తున్నారు. అభిమానుల సలహాలను తీసుకుంటున్నారు. ఆమెతో ఇప్పటికే పలువురు నేతలు, మాజీ ఐఏఎస్ లు, ఐపీఎస్ లు భేటీ అయ్యారు.

మరోవైపు షర్మిల తాను పెట్టబోతున్న పార్టీకి సంబంధించి అధికారికంగా తొలి నియామకం చేశారు. తన కార్యక్రమాల సమన్వయకర్తగా వాడుక రాజగోపాల్ ను నియమించారు. రాజగోపాల్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందినవారు. వైయస్ కుటుంబంతో ఆయనకు 30 ఏళ్లుగా పరిచయం ఉంది.

మరోవైపు టీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,  రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ దయానంద్ పార్టీకి రాజీనామా చేశారు. గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ పదవికి కూడా రాజీనామా చేశారు. అనంతరం షర్మిలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, షర్మిలకు మద్దతు ప్రకటించానని చెప్పారు.