Harish Rao: బీజేపీ నేతలు చేతనైతే ఢిల్లీలో మాట్లాడాలి: హరీశ్ రావు

Harish Rao fires on Telangana BJP leaders
  • బీజేపీ నేతలపై హరీశ్ రావు ఆగ్రహం
  • ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం
  • బీజేపీ ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిందని వ్యాఖ్యలు
  • బీజేపీకి ఎందుకు ఓటేయాలంటూ విసుర్లు
తెలంగాణ బీజేపీ నేతలపై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. నోరు ఉంది కదా అని బీజేపీ నేతలు ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నారని, వారికి చేతనైతే ఢిల్లీలో మాట్లాడాలని అన్నారు. కేంద్రం పెద్దలను నిలదీయాలని సూచించారు. బీజేపీ ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిందని, ఇప్పుడు బీఎస్ఎన్ఎల్, రైల్వే, ఎల్ఐసీలను అమ్మేయాలని చూస్తోందని ఆరోపించారు.

 బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి?... పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెంచినందుకు ఓటు వేయాలా? అని హరీశ్ రావు నిలదీశారు. ఎరువుల సబ్సిడీని బడ్జెట్ లో రూ.2 లక్షల కోట్లు తగ్గించారని వెల్లడించారు. బీజేపీ ఏమీ చేయకపోవడమే కాకుండా, రాష్ట్రానికి రావాల్సింది కూడా ఇవ్వడంలేదని విమర్శించారు.
Harish Rao
BJP
Delhi
Telangana
TRS

More Telugu News