దొంగ లెక్కలు చెప్పడానికి ఇది నువ్వు పెట్టిన సూట్ కేస్ కంపెనీ కాదు విజయసాయిరెడ్డీ: బుద్ధా వెంకన్న

22-02-2021 Mon 15:31
  • పోలవరం నీటి నిల్వ సామర్థ్యాన్ని 41.15 మీటర్లకు తగ్గించేశారు
  • ఇలా అయితే  ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీళ్లు ఎలా వస్తాయి?
  • విశాఖ జిల్లా ప్రజల అవసరాలు ఎలా తీరుతాయి?
This is not the suit case company you put up to tell the false calculations Vijayasaireddy says Budda Venkanna

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టుపై దొంగ లెక్కలు చెప్పడానికి ఇది నువ్వు పెట్టిన సూట్ కేస్ కంపెనీ కాదు విజయసాయిరెడ్డీ అని బుద్దా వెంకన్న విమర్శించారు.

కేంద్రం ముందు మెడలు వంచేసి, నీటి నిల్వ సామర్థ్యాన్ని 41.15 మీటర్లకు తగ్గించి, మీ దొంగల బ్యాచ్ చేస్తున్న పనులు అందరికీ తెలుసని అన్నారు. 41.15 మీటర్లకు పోలవరం నిర్మాణం జరిగితే... ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీళ్లు ఎలా వస్తాయని, విశాఖ జిల్లా ప్రజల అవసరాలు ఎలా తీరుతాయని ప్రశ్నించారు. పోలవరం నుంచి సన్నబియ్యం వాహనాల్లో నీటిని తరలిస్తారా? అని ఎద్దేవా చేశారు. దొంగ లెక్కలు చెప్పకు దొంగ లెక్కల రెడ్డీ... లేకపోతే ప్రజలు మరోసారి పాదరక్షల సన్మానం చేస్తారని ఘాటుగా ట్వీట్ చేశారు.