గోదావరి తీరంలో మణిరత్నం సినిమా షూటింగ్ సందడి

22-02-2021 Mon 14:16
  • 'పొన్నియన్ సెల్వన్'ను తెరకెక్కిస్తున్న మణిరత్నం
  • రామోజీ ఫిలింసిటీలో షెడ్యూల్ పూర్తి
  • మరో షెడ్యూల్ కోసం గోదావరి తీరానికి వెళ్లిన యూనిట్
  • సింగంపల్లి నుంచి పాపికొండలు వరకు షూటింగ్
Maniratnam new movie shooting at Godavari river banks

ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం 'పొన్నియన్ సెల్వన్' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇటీవల రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ జరుపుకుంది. తాజాగా కొన్ని సన్నివేశాలను గోదావరి తీరంలో చిత్రీకరించనున్నారు. మణిరత్నం చిత్రబృందం రాకతో పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం సింగంపల్లి వద్ద సందడి నెలకొంది.

సింగంపల్లి నుంచి పాపికొండలు వరకు గోదావరి నదిలో షూటింగ్ నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ కూడా పూర్తయింది. షూటింగ్ కోసం టూరిజం బోట్లను ప్రత్యేకంగా ముస్తాబు చేస్తున్నారు. పొన్నియన్ సెల్వన్ చిత్రంలో విక్రమ్, ఐశ్వర్యా రాయ్, జయం రవి, త్రిష తదితరులు నటిస్తున్నారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ భాగస్వామ్యంలో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.