మళ్లీ ప్రజల ఆదరాభిమానాలతో విజయం సాధిద్దాం: గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి

22-02-2021 Mon 13:25
  • పంచాయతీ ఎన్నికలు ముగిశాయి
  • గ్రామాల్లో  తెలుగుదేశం పటిష్ఠంగా ఉంది
  • ఇది తెలుగుదేశం కార్యకర్తల కృషి ఫలితం
  • అధికార నాయకుల భౌతిక దాడులను ఎదురొడ్డి పోరాడారు
gorantla slams ycp

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో టీడీపీ అద్భుతంగా రాణించింద‌ని ఆ పార్టీ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి అన్నారు. 'పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. గ్రామాల్లో తెలుగుదేశం పటిష్ఠంగా ఉందని నిరూపితం అయింది. ఇది తెలుగుదేశ కార్యకర్తల కృషి ఫలితం. అధికార నాయకుల భౌతిక దాడుల, ధన ప్రవాహనికి ఎదురొడ్డి పోరాడారు. వైసీపీ ఎన్ని న్యూస్ ల ని మ్యానేజ్ చేసినా తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధించారు అనేది వాస్తవం'  అని గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ట్వీట్ చేశారు.

'మంత్రులు, ఎంపీలు స్థాయి నుండి పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేసినప్పుడే తెలుగుదేశం కార్యకర్తలు నైతిక విజయం సాధించారు. పూర్వవైభవం ఎంతో దూరంలో లేదు. మన అందరి సమష్టి కృషి తో రాష్ట్రాన్ని తిరిగి గాడి లో పెట్టే సామర్ధ్యం తెలుగుదేశంకే ఉంది. మళ్లీ ప్రజల ఆదరాభిమానాలతో విజయం సాధిద్దాం' అని గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ట్వీట్లు చేశారు.