అదే ప‌నిగా 2 గంట‌లు కుర్చీలో కూర్చుంటే ప్ర‌మాద‌మంటోన్న ప‌రిశోధ‌కులు!

22-02-2021 Mon 13:17
  • రోచెస్టర్, మిన్నెసోటాకు చెందిన ప‌రిశోధక బృందం అధ్య‌య‌నం
  • 2 గంటల పాటు లేవకుండా కూర్చుంటే స‌మ‌స్య‌లు
  • గుండెజబ్బులు, ఆస్తమా, పక్షవాతం వచ్చే అవకాశాలు  
 Sitting Too Much Bad for Your Health

గ‌తి త‌ప్పిన జీవ‌న విధానం వ‌ల్ల ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను తెచ్చుకుంటున్నాం. ప్ర‌స్తుత కాలంలో కూర్చుని చేసే ప‌నులు పెరిగిపోయాయి. కొంద‌రు కంప్యూట‌ర్ల ముందు కూర్చొని  గంట‌ల త‌ర‌బ‌డి ప‌ని చేస్తూ ఉండిపోతారు. అయితే,  అలా ఒకేచోట కూర్చుని పనిచేసేవారు చాలా సేపు అలాగే కూర్చుంటే ప్ర‌మాద‌మ‌ని ప‌రిశోధ‌కులు తేల్చారు.

రోచెస్టర్, మిన్నెసోటాకు చెందిన  మయో వైద్య పరిశోధక బృందం.. కూర్చుని ప‌నిచేసే వారిపై అధ్య‌య‌నం చేసి ఫ‌లితాల‌ను వెల్ల‌డించింది. దాదాపు రెండు గంటల పాటు లేవ‌కుండా కూర్చొని ఉండటం వల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయ‌ని చెప్పారు. మ‌నం 20 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే ఎంత‌ ఆరోగ్యక‌రంగా త‌యారు అవుతామో రెండు గంటల పాటు లేవకుండా కూర్చొని ఉండటం వల్ల అంతటి న‌ష్టాన్ని కొని తెచ్చుకుంటామ‌ని చెప్పారు.  

ఈ ప‌రిశోధ‌న‌లో భాగంగా 2,000 మందికి పైగా వ్యక్తులను ఆరోగ్య ప‌రిస్థితుల‌ను అధ్య‌యం చేశామ‌ని తెలిపారు. కూర్చుని పనిచేసేవారు కనీసం రెండు గంటలకోసారి అయినా లేవకపోతే హృద్రోగాలు, ఆస్తమా, పక్షవాతం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువని తెలిపారు. మధ్యాహ్నం భోజనం తర్వాత కూడా తిరిగి కుర్చీలో కూర్చోకుండా కొద్దిసేపు న‌డవాల‌ని చెప్పారు.