ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకున్న పారిశుద్ధ్య కార్మికుల గానం!

22-02-2021 Mon 13:04
  • మంచి మెలోడీయస్‌‌ వాయిస్‌ ఉందని ప్ర‌శంస‌లు
  • ఢిల్లీలో పారిశుద్ధ్య కార్మికులుగా ప‌నిచేస్తోన్న హఫీజ్‌, హబీబర్‌
  • వీడియో వైర‌ల్  
mahindra post interesting video

సామాజిక మాధ్య‌మాల్లో చురుకుగా ఉండే మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మ‌రోసారి ఓ ఆస‌క్తిక‌ర వీడియోను పోస్ట్ చేసి అల‌రించారు. ఢిల్లీలో పారిశుద్ధ్య కార్మికులుగా ప‌నిచేస్తోన్న హఫీజ్‌, హబీబర్‌ అనే ఇద్దరు అన్నదమ్ములు అద్భుతంగా పాటలు పాడారు.  

ప‌ని చేస్తోన్న స‌మ‌యంలోనే వారు పాటు పాడుతుండ‌గా ఎవ‌రో వీడియోలు తీసి పోస్ట్ చేయ‌డంతో వారి పాట‌లు వైర‌ల్ అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఈ వీడియోలు ఆనంద్ మ‌హీంద్రా కంట ప‌డ్డాయి. వారిద్ద‌రికీ మంచి మెలోడీయస్‌‌ వాయిస్‌ ఉందని ఆయ‌న ప్ర‌శంస‌లు కురిపించారు.

ఢిల్లీలోని సంగీత టీచ‌ర్లు సాయంత్రం పూట వారికి కొంత సమయం కేటాయించాలని ఆయ‌న కోరారు. ఆనంద్ మ‌హీంద్రా ఈ వీడియోల‌ను పోస్ట్ చేయ‌డంతో వారి ప్ర‌తిభ గురించి మ‌రింత మందికి తెలిసింది.