Puduchcherry: పుదుచ్చేరిలో కుప్పకూలిన కాంగ్రెస్ ప్రభుత్వం... సీఎం రాజీనామా!

  • బల నిరూపణలో నారాయణ స్వామి విఫలం
  • రాజీనామా లేఖతో రాజ్ భవన్ కు పయనం
  • సాయంత్రంలోగా నిర్ణయం తీసుకోనున్న గవర్నర్ 
Puduchcherry CM Resins

పుదుచ్చేరి అసెంబ్లీలో కొద్దిసేపటి క్రితం జరిగిన బల నిరూపణలో వి. నారాయణ స్వామి ఓడిపోయారు. దీంతో దాదాపు నాలుగున్నర ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. బల నిరూపణలో ఓటమి చెందగానే, తన రాజీనామా లేఖతో నారాయణ స్వామి రాజ్ భవన్ కు పయనం అయ్యారు. తెలంగాణ గవర్నర్ గా ఉన్న తమిళిసై ప్రస్తుతం పుదుచ్చేరి తాత్కాలిక గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఆమె ప్రస్తుతం పుదుచ్చేరి రాజ్ భవన్ లోనే ఉన్నారు. మరికాసేపట్లో ఆమెను కలవనున్న నారాయణ స్వామి తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు. ఆపై అసెంబ్లీలో ఇతర పార్టీల బలాబలాలను, న్యాయ నిపుణుల సలహాలను స్వీకరించిన తర్వాత గవర్నర్ తమిళిసై, తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

More Telugu News