బాధ్యతలు స్వీకరించిన జీహెచ్ఎంసీ కొత్త‌ మేయర్ విజ‌య‌ల‌క్ష్మి

22-02-2021 Mon 11:16
  • మేయర్‌గా కేశవరావు కుమార్తె  విజయలక్ష్మి ఇటీవ‌లే ఎన్నిక
  • జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో బాధ్యతల స్వీక‌ర‌ణ‌
  • తలసానితో పాటు కె.కేశవరావు హాజరు
  •  కార్యాలయంలో ప్రత్యేక పూజలు  
vijaya lakshmi take charges as ghmc mayor

గ్రేటర్‌ హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ మేయర్‌గా టీఆర్ఎస్ నేత కె.కేశవరావు కుమార్తె  గద్వాల‌ విజయలక్ష్మి ఇటీవ‌లే ఎన్నికైన విష‌యం తెలిసిందే. ఈ రోజు ఉద‌యం ఆమె బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమె బాధ్యతలు స్వీక‌రించిన సంద‌ర్భంగా మంత్రి తలసానితో పాటు కె.కేశవరావు కూడా హాజరయ్యారు. విజయలక్ష్మి తన కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

కాగా, ఈనెల 11న కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం జరిగిన విష‌యం తెలిసిందే. అనంత‌రం మేయర్, డిప్యూటీ మేయర్ ను ఎన్నుకున్నారు. డిప్యూటీ మేయర్‌గా శ్రీలత ఎన్నికైన విషయం తెలిసిందే. ఆమె కూడా ఈ రోజే బాధ్యతలు స్వీక‌రించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.