‘సీటీమార్’ సినిమా టీజ‌ర్ విడుద‌ల‌!

22-02-2021 Mon 10:55
  • గోపీచంద్  హీరోగా ‘సీటీమార్’
  • సంపత్ నంది ద‌ర్శ‌క‌త్వం 
  • ఏప్రిల్ 2న విడుద‌ల‌
The game just started Person running SeetimaarrTeaser

'క‌బ‌డ్డీ.. మైదానంలో ఆడితే ఆట‌.. బ‌య‌ట ఆడితే వేట' అంటున్నాడు యాక్షన్ హీరో గోపీచంద్. ఆయ‌న‌ న‌టిస్తోన్న కొత్త సినిమా ‘సీటీమార్’ టీజ‌ర్‌ను ఈ రోజు ఆ సినిమా యూనిట్ ఈ రోజు విడుద‌ల చేసింది.

ఆయ‌న చేస్తోన్న ఫైటింగులు ప్రేక్ష‌కుల‌తో ‘సీటీమార్’ అనిపించేలా ఉన్నాయి. గోపీచంద్ ఈల వేయ‌డంతో ఈ టీజ‌ర్ ముగుస్తుంది. క‌బ‌డ్డీ ఆట నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాను మాస్ డైరెక్టర్ సంపత్ నంది రూపొందిస్తున్నాడు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇందులో త‌మ‌న్నా, దిగంగన సూర్యవంశి, భూమిక, రావు రమేశ్ కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. ఇందులో ఐటెంసాంగ్ లో అప్స‌ర రాణి క‌న‌ప‌డ‌నుంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.