రెండో పెళ్లి వార్తలపై స్పష్టత నిచ్చిన సినీ నటి సురేఖవాణి

22-02-2021 Mon 09:51
  • రెండున్నరేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన భర్త
  • కుమార్తె ప్రోద్బలంతో రెండో పెళ్లికి సిద్ధమవుతున్నట్టు వార్తలు
  • అలాంటి ఉద్దేశం లేదన్న సురేఖవాణి
Actress Surekha Vani Responded about Re Marriage

తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు వస్తున్న వార్తలపై టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి సురేఖ వాణి స్పందించారు. ఆ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని, మరోమారు పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. సురేఖ భర్త రెండున్నరేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

సురేఖ కూడా గాయని సునీతను ఫాలో అవుతున్నారని,  కుమార్తె సుప్రీత నిర్ణయం మేరకు సురేఖ రెండో పెళ్లికి సిద్ధమయ్యారని పుకార్లు షికారు చేస్తున్నాయి. దీంతో స్పందించిన సురేఖ వాటిని కొట్టిపడేశారు. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని, మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టే ఉద్దేశం తనకు లేదని తేల్చి చెప్పారు.