తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అన్ని సదుపాయాలూ వున్నది వరంగల్లులోనే: సినీ నటుడు నాగబాబు

22-02-2021 Mon 08:34
  • ఐఎంఎఫ్ఎస్ శాఖను ప్రారంభించిన నాగబాబు
  • నగరంలో ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలు
  • విద్యార్థులు అందుకోవాలని పిలుపు
Warangal is Second Best City in Telangana Says Nagababu

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉంటాయని, రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత వరంగల్ లోనే అన్ని సౌకర్యాలూ ఉన్నాయని మెగా బ్రదర్ నాగబాబు వ్యాఖ్యానించారు. హన్మకొండకు వచ్చిన ఆయన, విదేశీ విద్య కోసం కన్సల్టెన్సీ సేవలను అందించే ఐఎంఎఫ్ఎస్ శాఖను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. అన్ని విధాలుగా వరంగల్ నగరం ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలు ఇక్కడ ఉన్నాయని అన్నారు. ఐఎంఎఫ్ఎస్ అందించే అవకాశాలను విద్యార్థులు అందుకోవాలని నాగబాబు సూచించారు. ఈ సందర్భంగా నాగబాబుతో సెల్ఫీలు దిగేందుకు మెగా అభిమానులు పోటీ పడ్డారు.