సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

22-02-2021 Mon 07:28
  • వచ్చే నెలలో కాజల్ హిందీ సినిమా 
  • మరో సినిమాలో విజయశాంతి 
  • అలీ హీరోగా 'లాయర్ విశ్వనాథ్' 
Kajal Agarwals Hindi film Mumbai Saga release date announced

*  కథానాయిక కాజల్ అగర్వాల్ నటించిన హిందీ చిత్రం 'ముంబై సాగా' విడుదలకు సిద్ధమైంది. మార్చ్ 19న ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సంజయ్ గుప్తా దర్శకత్వంలో భూషణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో జాన్ అబ్రహాం, ఇమ్రాన్ హష్మి హీరోలుగా నటించారు.
*  ఆమధ్య 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నటి విజయశాంతి మరో సినిమాలో నటించడానికి సమాయత్తమవుతున్నారు. గతంలో ఆమెతో 'భారతరత్న' చిత్రాన్ని నిర్మించిన ప్రతిమ ఫిలిమ్స్ సంస్థ ఇప్పుడు విజయశాంతితో మరో పవర్ ఫుల్ సబ్జెక్టుతో సినిమా నిర్మించనున్నట్టు సమాచారం.  కశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో ఇది తెరకెక్కుతుందని అంటున్నారు.  
*  ప్రముఖ హాస్యనటుడు అలీ హీరోగా నటించిన చిత్రం 'లాయర్ విశ్వనాథ్'. బాలనాగేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఈ నెల 26న రిలీజ్ చేస్తున్నారు. ఇందులో తనతో పాటు తన కూతురు కూడా ఓ ముఖ్య పాత్రలో నటించిందని అలీ చెప్పారు.