పంచాయతీ ఎన్నికల్లో ఓటేయడానికి భార్యతో కలిసి మోపెడ్ పై వచ్చిన రఘువీరారెడ్డి... వీడియో ఇదిగో!

21-02-2021 Sun 22:11
  • ఏపీలో నేడు నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు
  • గంగులవానిపాలెంలో ఓటు హక్కు వినియోగించుకున్న రఘువీరా
  • సాధారణ వేషధారణతో పోలింగ్ కేంద్రానికి వచ్చిన వైనం
  • సందడి చేస్తున్న వీడియో
Raghuveera came to polling booth on a moped

ఇవాళ పంచాయతీ ఎన్నికల చివరి విడత పోలింగ్ సందర్భంగా ఆసక్తికర దృశ్యం కనిపించింది. మాజీ మంత్రి, పీసీసీ మాజీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి ఓ సాధారణ మోపెడ్ వాహనంపై పోలింగ్ కేంద్రానికి విచ్చేశారు. అది కూడా పక్కా రాయలసీమ స్టయిల్లో పంచెకట్టు, చొక్కా, పైన తువాలుతో ఓటింగ్ కేంద్రానికి వచ్చారు.

అంతేకాదు, మోపెడ్ పై తన అర్ధాంగి సునీతను కూడా తీసుకువచ్చారు. అనంతపురం జిల్లా గంగులవానిపాలెంలో రఘువీరారెడ్డి, సునీత దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తోంది.