చాన్నాళ్ల తర్వాత ఒకే ఫ్రేములో పవన్, అలీ!

21-02-2021 Sun 14:57
  • సినీ రంగంలో స్నేహితులుగా గుర్తింపు పొందిన పవన్, అలీ
  • పవన్ ప్రతి సినిమాలో అలీ!
  • జనసేనతో రాజకీయాల్లోకి వెళ్లిన పవన్
  • గత ఎన్నికల వేళ వైసీపీలో చేరిన అలీ
  • ఇద్దరి మధ్య ఎడం పెరిగిందంటూ కథనాలు
Pawan Kalyan attends a function at comedian Ali residence

సినీ రంగంలో పవన్ కల్యాణ్, అలీ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ నటించిన ప్రతి సినిమాలోనూ అలీ ఉంటాడన్న రేంజిలో వారి ఫ్రెండ్షిప్ కొనసాగింది. అయితే, పవన్  జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లో ప్రవేశించగా, గత ఎన్నికల సమయంలో అలీ వైసీపీలో చేరాడు. అనంతరం జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో ఇద్దరి మధ్య ఎడం పెరిగిందన్న వార్తలు వినిపించాయి. అది నిజమే అనిపించేలా చాన్నాళ్ల పాటు వారిద్దరూ కలుసుకున్నది లేదు!

అయితే, తాజాగా అలీ ఇంట జరిగిన ఓ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా పవన్, అలీ మాట్లాడుకుంటున్న వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నది అలీ అర్ధాంగి జుబేదానే. మొత్తానికి స్నేహితులిద్దరూ మళ్లీ ఒకే ఫ్రేములో కనిపించడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.