Plane: అమెరికాలో పెనుప్రమాదం నుంచి తప్పించుకున్న విమానం... విమానంలోంచి తీసిన వీడియో వైరల్

  • డెన్వర్ నుంచి హోనోలులూ బయల్దేరిన విమానం
  • కుడివైపు ఇంజిన్ లో మంటలు
  • విడిపోయి నేల రాలిన ఇంజిన్ భాగాలు
  • ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన పైలెట్లు
Plane escaped from huge collapse in Denver

అమెరికాలో ఓ విమానం కుడి ఇంజిన్ చెడిపోవడంతో అత్యవసరంగా ల్యాండైంది. ఈ ఘటనలో కొన్ని విమాన భాగాలు నివాస ప్రాంతాల్లో పడడం ఆందోళన కలిగించింది. కాగా విమాన ప్రమాదంపై ఆ విమానం లోపలి నుంచి తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 777-200 విమానం డెన్వర్ నుంచి హవాయి ద్వీపంలోని హోనోలులూ నగరానికి బయల్దేరింది. అయితే టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే విమానం కుడివైపు ఇంజిన్ లో మంటలు చెలరేగాయి.
ఈ ఘటనను విమానంలోని ప్రయాణికులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. కాగా, విమానం ఇంజిన్ తాలూకు విడిభాగాలు ఓ ఇంటి వెలుపల చెల్లాచెదురుగా పడ్డాయి. అయితే విమానాన్ని పైలెట్లు వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో సిబ్బంది సహా 241 మంది ఉన్నారు.

More Telugu News