పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన కరీనా కపూర్.. తైమూర్‌కు త‌మ్ముడు!

21-02-2021 Sun 13:18
  • ఐదేళ్ల త‌ర్వాత రెండో బిడ్డ‌కు జ‌న్మ‌
  • నిన్న రాత్రి ఆసుప‌త్రిలో చేరిన క‌రీనా
  • ఈ రోజు ఉద‌యం కాన్పు
karina blessed with baby boy

బాలీవుడ్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌, హీరో సైఫ్‌ అలీఖాన్ కు ఐదేళ్ల కుమారుడు తైమూర్ ఉన్న విష‌యం తెలిసిందే. ఐదేళ్ల త‌ర్వాత వారికి మ‌రో కుమారుడు పుట్టాడు. క‌రీనా క‌పూర్  ఈ రోజు ఉదయం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. నిన్న  రాత్రి ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చేరిన ఆమెకు వైద్యులు కాన్పు చేశారు.

గ‌త ఏడాది ఆగస్టు 12న క‌రీనా క‌పూర్ ట్వీట్ చేస్తూ తాను గర్భవతి అన్న విష‌యాన్ని తెలిపింది. రెండోసారి కూడా ఆమెకు కుమారుడే పుట్టాడు. ఆమెకు అభిమానులు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.  సైఫ్‌ అలీఖాన్ కు‌ 2012లో కరీనాతో పెళ్లి  జ‌రిగింది. 2016 డిసెంబర్‌లో ప్ర‌థ‌మ పుత్రుడు తైమూర్‌ జన్మించాడు. తైమూర్ ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో బాగా వైర‌ల్ అవుతున్నాయి. సైఫ్ అలీఖాన్ ప్ర‌స్తుతం‌ ప్రభాస్‌ ఆదిపురుష్‌ సినిమాలో విలన్‌గా న‌టిస్తున్నాడు.