బీఎస్పీ నేత తనతో అసభ్యంగా ప్రవర్తించారని బీజేపీ మహిళా నేత షాజియా ఇల్మీ ఆరోపణ!

21-02-2021 Sun 06:37
  • వసంత్ కుంజ్ ప్రాంతంలో పార్టీ
  • పార్టీకి వచ్చిన మాజీ ఎంపీ అక్బర్ అహ్మద్
  • ఐపీసీ సెక్షన్ 506 కింద కేసు
BJP Women Leader Accuses BSP Leader for Misbehaving

బహుజన్ సమాజ్ పార్టీ మాజీ ఎంపీ అక్బర్ అహ్మద్ డుంపీ తనతో అసభ్యంగా ప్రవర్తించారని బీజేపీ ఢిల్లీ ఉపాధ్యక్షురాలు షాజియా ఇల్మి ఆరోపించగా, పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. తాను ఓ ప్రైవేటు పార్టీలో పాల్గొన్న వేళ, ఈ ఘటన జరిగిందని ఆమె తెలిపారు. షాజియా ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 506 కింద కేసు పెట్టామని వెల్లడించారు.

వసంత్ కుంజ్ ప్రాంతంలో జరిగిన ఓ పార్టీకి తాను ఈ నెల 5న వెళ్లానని, అక్కడకు వచ్చిన అక్బర్ అహ్మద్, తనతో అసభ్యంగా మాట్లాడుతూ, వేధించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఇంగిత్ ప్రతాప్ సింగ్ వెల్లడించారు. ఇక, ఈ విషయమై స్పందించేందుకు అక్బర్ అహ్మద్ డుంపీ అందుబాటులో లేరు.