ఏపీ ఇచ్చిన ఆఫర్ మీరూ ఇవ్వండి: కేసీఆర్ కు చిత్ర పరిశ్రమ వినతి!

21-02-2021 Sun 06:32
  • ప్రభుత్వ లొకేషన్లలో ఉచితంగా షూటింగ్
  • ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో అమలు
  • తెలంగాణలోనూ అమలు చేయాలన్న నిర్మాతల మండలి
Tollywood Producers want Free Shooting in Govt Locations

ప్రభుత్వ లొకేషన్లలో ఉచితంగా షూటింగ్ చేసుకునేందుకు అనుమతించాలని టాలీవుడ్ నిర్మాతల మండలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అభ్యర్థించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఈ ఆఫర్ అందుబాటులో ఉందని గుర్తుచేసిన నిర్మాతల మండలి, కరోనాతో తీవ్రంగా నష్టపోయిన చిత్ర పరిశ్రమ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని అవకాశం కల్పించాలని, కనీసం రెండేళ్ల పాటు షూటింగ్ లొకేషన్లను ఉచితంగా ఇవ్వాలని కోరింది.

ఇప్పుడిప్పుడే సినీ నిర్మాణ రంగం కుదురుకుంటోందని, ప్రభుత్వ లొకేషన్లలో అద్దెల భారాన్ని తగ్గిస్తే, మొత్తం పరిశ్రమకు మేలు జరుగుతుందని పేర్కొంది. ఈ మేరకు సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరింది. కేసీఆర్ సైతం నిర్మాతల మండలి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.