Team India: ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ కు టీమిండియా ఎంపిక

Team India announced for England series
  • మార్చి 12 నుంచి ఇంగ్లండ్ తో టీ20 సిరీస్
  • ఇంగ్లండ్ తో 5 మ్యాచ్ లు ఆడనున్న భారత్
  • కోహ్లీ సారథ్యంలో 19 మందితో జట్టు ప్రకటన
  • తెవాటియాకు చోటు
ప్రస్తుతం ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ ఆడుతున్న టీమిండియా ఆ తర్వాత టీ20 సిరీస్ లో అమీతుమీ తేల్చుకోనుంది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ మార్చి 12న ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో ఆడే టీమిండియాను ఈ సాయంత్రం ప్రకటించారు. విరాట్ కోహ్లీ సారథ్యంలో 19 మందితో కూడిన జట్టును బీసీసీఐ సీనియర్ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది.

గత ఐపీఎల్ లో సత్తా చాటిన రాహుల్ తెవాటియా, సూర్యకుమార్ యాదవ్ లకు జాతీయ జట్టులో స్థానం కల్పించారు. తమిళనాడు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిపైనా సెలెక్టర్లు నమ్మకం కనబరిచారు. రిషబ్ పంత్ తో పాటు మరో వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్ ను ఎంపిక చేశారు. అంతేకాదు, యార్కర్ స్పెషలిస్టు టి.నటరాజన్ కూడా జట్టుకు ఎంపికయ్యాడు. కాగా టీ20 సిరీస్ కు ప్రధాన పేసర్లకు, స్పిన్నర్లకు విశ్రాంతినిచ్చారు.

జట్టు సభ్యులు వీరే...

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), యజువేంద్ర చహల్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, టి.నటరాజన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, నవదీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్.
Team India
T20 Series
England
Virat Kohli

More Telugu News