Sachin Tendulkar: కోహ్లీ నిర్ణయంపై గర్విస్తున్నా: సచిన్

Feeling great about Kohli says Sachin
  • తాను డిప్రెషన్ కు లోనయ్యానని చెప్పిన కోహ్లీ
  • కోహ్లీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడంపై గర్విస్తున్నానన్న సచిన్
  • యువతకు మనం సహకరించాలని సూచన
తన స్వీయ అనుభవాలను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. తాను కూడా డిప్రెషన్ కు లోనయ్యానని కోహ్లీ చెప్పాడు. 2014లో ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా ప్రపంచంలో తాను ఒక్కడినే అనే భావన కలిగిందని తెలిపాడు. డిప్రెషన్ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో కోహ్లీని క్రికెట్ దిగ్గజం సచిన్ అభినందించాడు.

తాను సాధించిన విజయాలతో పాటు వ్యక్తిగత అనుభవాలను పంచుకోవాలని కోహ్లీ తీసుకున్న నిర్ణయంపై తాను గర్విస్తున్నానని సచిన్ చెప్పాడు. యువత పరిస్థితిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోందని, యువత స్థితిని సోషల్ మీడియాలో అంచనా వేస్తున్నారని తెలిపాడు. యువత గురించి మాట్లాడుతున్నారే తప్ప... వారితో ఎవరూ మాట్లాడటం లేదని చెప్పాడు. వాళ్ల పరిస్థితిని వారు తెలుసుకునేలా మనం సహకరించాలని అన్నాడు.
Sachin Tendulkar
Virat Kohli
Team India

More Telugu News