అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ రియల్ హీరోలు కాదు: మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్

20-02-2021 Sat 19:09
  • దేశంలో చమురు ధరల పెంపు
  • బాలీవుడ్ నటులు స్పందించడంలేదన్న నానా పటోలే
  • అక్షయ్, అమితాబ్ కాగితం పులులని వ్యాఖ్యలు
  • వారి సినిమాలు విడుదలైతే నిరసనలు తెలుపుతామని వెల్లడి
Maharashtra Congress chief says Akshay and Amitab are not real heroes

మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నానా పటోలే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో చమురు ధరలు మండిపోతుండడం పట్ల బాలీవుడ్ నటులు స్పందించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ నిజమైన హీరోలు కాదని అన్నారు.

ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు వారు జనపక్షం వహిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. వారికి వ్యతిరేకంగా తానేమీ మాట్లాడబోనని, కానీ వారి వైఖరి పట్ల స్పందిస్తున్నానని పటోలే స్పష్టం చేశారు. వారిద్దరూ తమను తాము కాగితం పులులు అని అంగీకరిస్తే తాము ఇంకేమీ అభ్యంతరపెట్టబోమని తెలిపారు. ఇకపై వారిద్దరి సినిమాలు విడుదలైతే మాత్రం కాంగ్రెస్ శ్రేణులు నల్లజెండాలతో నిరసనలు తెలుపుతాయని వెల్లడించారు.