దేవినేని అవినాశ్ - కేశినేని నాని మధ్య మాటల యుద్ధం

20-02-2021 Sat 19:01
  • నాని రౌడీయిజం అందరికీ తెలుసన్న అవినాశ్
  • కేశినేని డిప్రెషన్ లోకి వెళ్తున్నారంటూ వ్యాఖ్య
  • అధికారం పోగానే అవినాశ్ పార్టీ మారాడన్న నాని
  • అవినాశ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలన్న నాని 
Devineni Avinash Vs Kesineni Nani

టీడీపీ ఎంపీ కేశినేని నాని, వైసీపీ నేత దేవినేని అవినాశ్ మధ్య మాటల తూటాలు పేలాయి. విజయవాడలో రౌడీయిజం ఎవరు చేశారో అందరికీ తెలుసని కేశినేని నానిని ఉద్దేశించి అవినాశ్ విమర్శించారు. ట్రాన్స్ పోర్ట్ అధికారిపై చేసిన రౌడీయిజాన్ని ఆయన మర్చిపోయారా? అని ప్రశ్నించారు. తన కూతురు మేయర్ కాలేకపోతోందని నాని డిప్రెషన్ లోకి వెళ్తున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కేశినేని నాని మండిపడ్డారు.

కుక్కను సింహాసనం ఎక్కించినట్టు అవినాశ్ కు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవిని చంద్రబాబు ఇచ్చారని... అందుకుగాను సీఎంగా చంద్రబాబు, మంత్రిగా లోకేశ్ ఉన్నంత కాలం వారి ఫొటోలకు అవినాశ్ పాలాభిషేకాలను చేశాడని... టీడీపీకి అధికారం పోగానే పార్టీ మారాడని కేశినేని నాని విమర్శించారు. అధికారం పోగానే మరొకరికి పాలాభిషేకం చేస్తున్నాడని దుయ్యబట్టారు. బెజవాడ రౌడీయిజాన్ని తాను చిన్నప్పుడే చూశానని, గూండాయిజం చేయడానికి ఇవి పాత రోజులు కావని చెప్పారు. టీడీపీ మహిళా అభ్యర్థిని పోటీ చేయవద్దని అవినాశ్ దాడి చేయించాడని... ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలని హెచ్చరించారు.