దోహా నుంచి గన్నవరం వస్తూ స్తంభాన్ని ఢీకొన్న ఎయిరిండియా విమానం

20-02-2021 Sat 18:36
  • స్వల్ప ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానం
  • గన్నవరంలో ల్యాండింగ్ సందర్భంగా అపశ్రుతి 
  • విమానం అదుపుతప్పిన వైనం
  • విమానంలో 64 మంది ప్రయాణికులు
Airindi plane from Doha hits pole in Gannavaram airport

దోహా నుంచి గన్నవరం వస్తున్న ఎయిరిండియా విమానం స్వల్ప ప్రమాదానికి గురైంది. గన్నవరం ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా విమానం అదుపుతప్పి రన్ వే పక్కనే ఉన్న ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎయిరిండియా విమానం రెక్కలు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 64 మంది ప్రయాణికులున్నారు. ప్రయాణికులు సురక్షితంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని విమానాశ్రయ డైరెక్టర్ వెల్లడించారు. కాగా, దెబ్బతిన్న విమానం రెక్కలకు మరమ్మతులు నిర్వహించేందుకు నిపుణుల బృందం గన్నవరం రానుంది.