ఏపీలో కొత్తగా 54 మందికి కరోనా నిర్ధారణ

20-02-2021 Sat 18:18
  • గత 24 గంటల్లో 26,436 కరోనా టెస్టులు
  • చిత్తూరు జిల్లాలో 19 మందికి పాజిటివ్
  • శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులు నిల్
  • యాక్టివ్ కేసుల సంఖ్య 604
Fifty four more corona cases identify in AP

రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 26,436 కరోనా పరీక్షలు నిర్వహించగా 54 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 19 మంది కరోనా బారినపడ్డారు. తూర్పు గోదావరి జిల్లాలో 6, కర్నూలు జిల్లాలో 6 కేసులు గుర్తించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 70 మంది కొవిడ్ ప్రభావం నుంచి కోలుకోగా, రాష్ట్రంలో ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఏపీలో ఇప్పటివరకు 8,89,210 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,81,439 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 604 మందికి చికిత్స జరుగుతోంది. అటు, కరోనా మృతుల సంఖ్య 7,167గా నమోదైంది.