స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ప్రధాన సూత్రధారి పాదయాత్ర చేస్తుంటే ప్రజలు మూగజీవాల్లా వెంట నడుస్తున్నారు: వర్ల రామయ్య

20-02-2021 Sat 16:47
  • రగులుతున్న విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం
  • వైజాగ్ లో విజయసాయి పాదయాత్ర
  • ప్రధాన లబ్దిదారుడు అంటూ వర్ల వ్యాఖ్యలు 
  • ప్రజలను మభ్యపెడుతున్నాడని విమర్శలు
  • భరతమాత నమో అంటూ ట్వీట్
Varla Ramaiah comments on Viajayasai Reddy Porata Yatra

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారం పరిరక్షణ పోరాట యాత్ర పేరుతో పాదయాత్ర ప్రారంభించడం తెలిసిందే. దీనిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ప్రధాన సూత్రధారి, మార్గదర్శి, మధ్యవర్తి (బ్రోకర్), ప్రధాన లబ్దిదారుడు, పలు కేసుల్లో నిందితుడు, ఏది అసాధ్యమో తెలిసినా, సాధ్యమేనంటూ మభ్యపెడుతూ పాదయాత్ర చేస్తున్నాడని ఆరోపించారు. కానీ అతని వెంట మూగజీవాల్లా నడుస్తున్న ప్రజలను చూస్తుంటే నవ్వాలో ఏడ్వాలో అర్థంకావడం లేదని వ్యాఖ్యానించారు. భరతమాత నమో అంటూ ట్వీట్ చేశారు.