DDRP: పోలవరం ప్రాజెక్టుకు ప్రపంచంలోనే అతిపెద్ద గేట్ల ఏర్పాటు: డీడీఆర్పీ చైర్మన్ వెల్లడి

DDRP Chairman says world biggest gates for Polavaram project
  • ముగిసిన డీడీఆర్పీ సమావేశం
  • వివరాలు తెలిపిన డీడీఆర్పీ చైర్మన్ పాండ్య
  • పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయని వెల్లడి
  • నిన్న ప్రాజెక్టును సందర్శించిన డీడీఆర్పీ బృందం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంశంపై డామ్ డిజైన్స్ రివ్యూ ప్యానెల్ (డీడీఆర్పీ) సమావేశం నిర్వహించారు. డీడీఆర్పీ చైర్మన్ ఏబీ పాండ్య అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనిపై చైర్మన్ ఏబీ పాండ్య మాట్లాడుతూ, 2022 నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. నిర్మాణ పనులపై అధికారులు, కాంట్రాక్టర్లతో చర్చించామని తెలిపారు. పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ప్రపంచంలోనే అతిపెద్ద గేట్లను ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. గేట్ల బిగింపు, అమరిక, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశామని ఏబీ పాండ్య చెప్పారు.

కాగా, డీడీఆర్పీ బృందం నిన్న పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించింది. తాజాగా ఇవాళ జరిగిన సమావేశంలో ప్రాజెక్టు పనులు చేపడుతున్న మేఘా ఇంజినీరింగ్ సంస్థ సమర్పించిన పలు డిజైన్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
DDRP
AB Pandya
Polavaram Project
Review

More Telugu News