నికార్సయిన హిందువునని చెప్పుకునే కేసీఆర్ శివాజీ జయంతి నాడు నివాళులు ఎందుకు అర్పించలేదు?: బండి సంజయ్

20-02-2021 Sat 15:21
  • ఖాసీం రజ్వీ వారసులు రాజ్యమేలుతున్నారని వ్యాఖ్యలు
  • నాటి అరాచక పాలనకు, నేటి పాలనకు తేడాలేదన్న బండి
  • దమ్ముంటే శివాజీ జయంతి జరపాలని సవాల్
  • శివాజీ స్ఫూర్తితో యుద్ధం చేయాల్సిందేనని పిలుపు
Bandi Sanjay asks CM KCR why Sivaji Jayanthi celebrations are not held

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ శివాజీ జయంతి నేపథ్యంలో సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. నికార్సయిన హిందువునని చెప్పుకునే సీఎం కేసీఆర్ శివాజీ జయంతి నాడు ఎందుకు నివాళులు అర్పించలేదని ప్రశ్నించారు. ఖాసీం రజ్వీ వారసులు ఇక్కడ ఏలుతున్నందునే శివాజీ జయంతిని జరపడంలేదని విమర్శించారు.

కేసీఆర్ కు దమ్ముంటే శివాజీ జయంతిని నిర్వహించాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. మత మార్పిళ్లు, గోహత్య, లవ్ జిహాద్ లు జరిగిన నాటి పాలనకు... ఇప్పుడు జరుగుతున్న పాలనకు తేడాలేదని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో శివాజీ స్ఫూర్తితో యుద్ధం చేయాల్సిందేనని పిలుపునిచ్చారు.