ఇది పద్యం కాదు గద్యం... బాణీలు ఎలా కట్టాలన్న ఇళయారాజా...  దీనికి మీరే సమర్థులన్న మోహన్ బాబు

20-02-2021 Sat 14:12
  • 'సన్ ఆఫ్ ఇండియా' చిత్రంలో నటిస్తున్న మోహన్ బాబు
  • సంగీతం అందిస్తున్న ఇళయరాజా
  • మ్యూజిక్ సిట్టింగ్స్ లో ఆసక్తికర సన్నివేశం
  • కఠినమైన గద్యాన్ని అలవోకగా పలికిన మోహన్ బాబు
  • ఆశ్చర్యపోయిన ఇళయరాజా
 Mohan Babu recites a prose in front of music maestro Ilayaraja

నట దిగ్గజం మోహన్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమాకు మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. సన్ ఆఫ్ ఇండియా మ్యూజిక్ సిట్టింగ్స్ కు సంబంధించిన వీడియోను మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు పంచుకున్నారు. ఈ వీడియోలో మోహన్ బాబు, ఇళయరాజా మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణను వీక్షించవచ్చు.

మోహన్ బాబు 11వ శతాబ్ద కాలం నాటి గద్యాన్ని ఇళయరాజాకు వినిపించి, దానికి బాణీలు కట్టాలని కోరారు. ఆ గద్యం అత్యంత సంక్లిష్టంగా ఉన్నా గానీ మోహన్ బాబు అలవోకగా పలకడం చూసి ఇళయరాజా ఆశ్చర్యపోయారు. ఇంత కఠినంగా ఉంది, దీనికి బాణీలు ఎలా కట్టాలి? అని ఇళయరాజా వ్యాఖ్యానించగా, అందుకు మీరే సమర్థులు... మీరు చేయనిదంటూ లేదు అని మోహన్ బాబు వినమ్రంగా స్పందించారు.