తెలంగాణలోని వైఎస్సార్‌‌ అభిమానులతో కొన‌సాగుతోన్న షర్మిల స‌మావేశాలు!

20-02-2021 Sat 12:42
  • త్వ‌ర‌లో పార్టీ ప్రారంభించ‌నున్న ష‌ర్మిల‌
  • నేడు రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల నేతలతో భేటీ
  • భవిష్యత్ కార్యాచరణపై చ‌ర్చ‌లు
sharmila meets with ysr fans

తెలంగాణలో కొత్త రాజకీయ‌ పార్టీ పెట్టాల‌ని వైఎస్ ష‌ర్మిల భావిస్తున్న‌ట్లు ప్రచారం జ‌రుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో వైఎస్సార్ అభిమానుల‌తో ఆమె సమావేశాలు కొన‌సాగిస్తున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో షర్మిల ఈ రోజు భేటీ అయ్యారు. తెలంగాణ‌లో ఎలా ముందుకు వెళ్లాలన్న అంశాల‌పై వారితో భవిష్యత్ కార్యాచరణపై ష‌ర్మిల‌ చర్చిస్తున్నారు.

కొన్ని రోజులుగా ఆమె  జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నేతలతో భేటీ అవుతున్నారు. నిన్న కూడా ఆమె ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా నేత‌ల‌తో త్వ‌ర‌లో రెండో విడ‌త చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు. తెలంగాణ‌లో జిల్లాల వారీగా ఆమె వైఎస్ అభిమానుల‌తో స‌మావేశం అవుతున్నారు. రాష్ట్రంలోని రాజ‌కీయ‌ పరిస్థితులను తెలుసుకుంటూ పార్టీ ఏర్పాటుకు చ‌క‌చకా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.