Vishnu Vardhan Reddy: శ్రీవారి లడ్డూలతో వైసీపీ ఎన్నికల ప్ర‌చారంపై చర్యలు తీసుకోవాలి: విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి డిమాండ్

Vishnu Vardhan Reddy slams ysrcp
  • ఇంతకంటే సిగ్గు చేటైన విషయం మరొకటి ఏమైనా ఉందా?  
  • చిత్తూరు జిల్లా, చంద్రగిరి అసెంబ్లీ, తొండవాడ పంచాయతీ పరిధిలో ఘ‌ట‌న‌
  • ఎన్నికల సంఘం వెంటనే చర్యలు చేపట్టాలి
శ్రీవారి లడ్డూతో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం చేసుకుంటోంద‌ని, ఇంతకంటే సిగ్గు చేటైన విషయం మరొకటి ఏమైనా ఉందా? అని బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో శ్రీవారి లడ్డూలు పంచుతూ వైసీపీ నేతలు ప్రచారం చేసిన వీడియోల‌ను ఆయ‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
 
'చిత్తూరు జిల్లా, చంద్రగిరి అసెంబ్లీ, తొండవాడ పంచాయతీ పరిధిలో అధికార వైసీపీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారి తిరుమల లడ్డూలు, అందులోను రాష్ట్ర ప్రభుత్వం బియ్యం పంపిణీ చేసే (నిత్యావసర సరుకులు) వాహనాల్లో పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభపెట్టి , దేవుడిని రాజకీయానికి వాడుతున్నారు' అని విమర్శిసంచారు.

'ఇంతకంటే సిగ్గుచేటైన విషయం మరొకటి ఏమైనా ఉందా? తక్షణం టీటీడీ వారు ఈ విషయం మీద కేసు నమోదు చేయాలి. ఎన్నికల సంఘం వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను డిమాండ్ చేస్తున్నాం. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి గారు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి' అని  విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి డిమాండ్ చేశారు.
Vishnu Vardhan Reddy
BJP
Andhra Pradesh

More Telugu News