coffee: అతిగా కాఫీ తాగుతున్నారా?.. అయితే ప్రమాద‌మేన‌ని హెచ్చ‌రిస్తోన్న ప‌రిశోధ‌కులు!

  • కాఫీ అధికంగా తాగడం వల్ల హృద్రోగాలు
  • ప్ర‌తిరోజు ఐదు కప్పుల‌కు మించి కాఫీ తాగితే ప్ర‌మాదం
  • తేల్చిన‌ యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ ఆస్ట్రేలియా ప‌రిశోధ‌కులు  
coffee dangerous for your health

కాఫీ ప్రియులు దాన్ని తాగే విష‌యంలో అతిగా వ్య‌వ‌హ‌రించొద్ద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. కాఫీ అధికంగా తాగడం వల్ల హృద్రోగాలు వస్తాయని తేల్చారు. ప్ర‌తిరోజు ఐదు కప్పుల‌కు మించి కాఫీ తాగేవారు హృద్రోగాల నుంచి త‌ప్పించుకోలేర‌ని చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ ఆస్ట్రేలియా ప‌రిశోధ‌కులు ఇందుకు సంబంధించిన వివ‌రాలను తాజాగా వెల్ల‌డించారు.

ప్రతిరోజూ ఐదు కప్పులకు మించి కాఫీ తాగుతున్న వారిలో..  కాఫీలో ఉండే కఫెస్టోల్‌ అనే రసాయన మూలకం కార‌ణంగా కొవ్వు పేరుకుపోతోంద‌ని వివ‌రించారు. దీంతో వారిలో రక్త ప్రసరణ సరిగ్గా‌ జరగకపోవ‌డంతో హృద్రోగాలు వ‌స్తున్నాయ‌ని అన్నారు.

ఫిల్టర్‌ చేయని కాఫీలో ఈ కఫెస్టోల్ అధికంగా ఉంటుందని చెప్పారు. కాఫీ ప్రియులు ఫిల్టర్‌ కాఫీకి ప్రాధాన్య‌త ‌ఇస్తే బాగుంటుంద‌ని చెప్పారు. త‌మ అధ్య‌య‌నాన్ని ఇంకా కొన‌సాగిస్తున్న‌ట్లు తెలిపారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు రోజుకు 300 కోట్ల కప్పుల కాఫీని తాగుతున్నారు. మ‌రోవైపు, హృద్రోగాల‌తో  ఏడాదికి 1.79 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

More Telugu News