Corona Virus: జపాన్ లో కొత్త రకం కరోనా వైరస్ గుర్తింపు.. వ్యాక్సిన్ పనితీరును కూడా దెబ్బతీసే గుణం!

  • తూర్పు జపాన్ లోని కాంటే ప్రాంతంలో కొత్త రకం గుర్తింపు
  • టోక్యో ఇమిగ్రేషన్ కేంద్రంలో ఇన్ఫెక్షన్ క్లస్టర్ ఏర్పాటు
  • కేసులు పెరిగే అవకాశం ఉందన్న జపాన్
New Corona variant found in Japan

ఇప్పటికే కరోనా వైరస్ కొత్త రకాలను వివిధ దేశాల్లో గుర్తించిన సంగతి తెలిసిందే. తమ దేశంలో కూడా మరో కొత్త కరోనా వైరస్ రకాన్ని గుర్తించినట్టు జపాన్ ప్రకటించింది. తూర్పు జపాన్ లోని కాంటే ప్రాంతంలో 91 కొత్త రకం కేసులను గుర్తించామని తెలిపింది. విమానాశ్రయాల్లో కూడా ఈ రకం కేసులు రెండింటిని గుర్తించామని వెల్లడించింది. ఇతర రకాల కంటే ఈ కోవిడ్ రకం విభిన్నంగా ఉందని... ఇది వేరే దేశాల్లో ఉత్పన్నమై ఉండొచ్చని జపాన్ కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ తెలిపింది. వ్యాక్సిన్ పనితీరును కూడా దెబ్బతీసే ఈ484కే మ్యుటేషన్ ఈ వైరస్ లో ఉందని చెప్పింది.

కొత్త రకం కోవిడ్ నేపథ్యంలో టోక్యో ఇమిగ్రేషన్ కేంద్రంలో ఇన్ఫెక్షన్ క్లస్టర్ ను ఏర్పాటు చేశామని తెలిపింది. ఇతర రకాల వైరస్ ల కంటే ఈ కొత్త వైరస్ మరింత వేగంగా వ్యాపించే అవకాశం ఉందని చెప్పింది. కొత్త రకం కరోనా వైరస్ వల్ల కేసులు మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలిపింది. వ్యాక్సిన్లకు కూడా ఈ వైరస్ లొంగకపోయే అవకాశం ఉండటం వల్ల... జపాన్ ప్రభుత్వం మరింత అప్రమత్తమయింది. జపాన్ లో ఈ వారమే వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఇంతలోనే కొత్త రకం వైరస్ బయటపడటం కలకలం రేపుతోంది.

More Telugu News